CSS Drop Down Menu

Wednesday, September 9, 2015

నాతో నటించనని చెప్పిన " హీరోయిన్లపై కసి తీర్చుకుంటా"నంటున్న హీరో !


తమిళ నటుడు ప్రేమ్ జీ అంటే హీరోయిన్లు పరార్ అవుతారు. దానికి కారణాలు అనేకం. ఆయనతో నటిస్తే ఇక కెరీర్ మటాష్ అవుతుందని  హీరోయిన్లు అనుకుంటుంటారన్నది కోలీవుడ్ టాక్. అదలావుంటే అతడు నటించిన "మాంగా" అనే తమిళ చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర విశేషాలను వివరిస్తూ ప్రేమ్ జీ... తనతో నటించనని చెప్పిన హీరోయిన్లపై కసి తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. దీనిపై అతడు స్పందిస్తూ... ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలామంది టాప్ హీరోయిన్లను సంప్రదించడం జరిగింది. 

ఈ చిత్రంలో నేను హీరో అని తెలిసి వాళ్లంతా ముఖం చాటేశారు. అలా తనతో నటించని హీరోయిన్లు ఎవరో ఓ లిస్టు తయారుచేసుకున్నాను. త్వరలోనే నేను  కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థాయికి చేరుకుని నాతో నటించనని చెప్పిన హీరోయిన్లందరినీ అమ్మ, అక్క పాత్రల్లో నటింపజేసుకుని వారిపై ఆవిధంగా కసి తీర్చుకుంటానని సెటైర్లు విసిరాడు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరోమరి ?

0 comments:

Post a Comment