CSS Drop Down Menu

Wednesday, September 2, 2015

"ఆరోగ్యం"తో పాటు"ఆయుష్యు"నూ పెంచుకోవాలంటే "ఉపవాసం" చేయాల్సిందే !

మనిషి ఎంత ఎక్కువ తింటే అంత శక్తి పెరుగుతుంది. అయితే ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని, ఆయుష్యు కూడా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయం దక్షిణ కరోలినా వర్శిటీ నిపుణులు చేసిన తాజా అధ్యయనం ద్వారా తేలింది. కండపుష్టి కోసం కావలసినంత తింటే చాలునట. కాస్త తక్కువ తింటే మరీ మంచిదని అంటున్నారు నిపుణులు. 
 
అంతేకాదండోయ్.. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం లేదా ఒంటి పూట భోజనం చేయడం వంటి పద్ధులేవైనా కావచ్చు. నెలకు కనీసం ఐదు రోజులు శరీరానికి రోజువారీ అవసరమైన కేలరీల్లో సగానికి సగం తగ్గించి తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఇటువంటి ఆహారపు పద్దతుల వలన కేన్సర్, హృద్రోగాలు, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవట.
 
ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా అవసరానికి కంటే తక్కువ ఆహారం తీసుకునేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారట. నెలకు కనీసం ఐదు రోజులు ఆహారంలోని కేలరీల్లో 34 నుంచి 54 శాతం మేరకు తగ్గించుకోగలిగితే వారి ఆయుష్యు బాగా పెరుగుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇదే పద్దతిని వారు ఎలుకలపై జరిపి మంచి ఫలితాలను పొందినట్టు తెలుపుతున్నారు. 
 
ఈ ప్రయోగంలో వారు ఎచ్చుకున్న ఎలుకలకు నాలుగు రోజుల చొప్పున నెలకు రెండుసార్లు ఆహారం తగ్గించగా, అవి మిగిలిన ఎలుకల కంటే ఆరోగ్యంగా, ఎక్కువ కాలం బతికాయని నిపుణులు స్పష్టం చేశారు.
 


0 comments:

Post a Comment