ఉద్యోగస్తులైనా, కార్మికులైనా మధ్యాహ్నం లాంగ్ బ్రేక్ తీసుకోవడం కంటే అంతకంటే ముందు.. షార్టు బ్రేక్
తీసుకోవడమే ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అది
ఆరోగ్యానికి ఎంతో హాయినిస్తుందని అంటున్నారు. తలనొప్పి, అలసట వంటి వాటి
నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. పైగా మంచి ఫలితాలు కూడా
వస్తాయట.
పని ప్రారంభించే ముందు లాంగ్ బ్రేక్
తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నట్లు ఎమ్లీ
హంటర్, సిండీ వూ అనే పరిశోధకులు చెబుతున్నారు. వీరు అమెరికాకు చెందిన 95
మందిపై పరిశోధన చేశారు. 22 నుంచి 67 యేళ్ళ వయస్సున్న వారిని ఎంపిక చేసుకుని
వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు.
సాధారణంగా ఉద్యోగి తన విధి నిర్వహణలో లంచ్
బ్రేక్, సాటి ఉద్యోగులతో సంభాషణ, బాత్ రూం వంటి అనేక బ్రేక్‌లు
తీసుకుంటుంటారు. అయితే ఈ బ్రేకలన్నింటి కంటే బ్రేక్ ఫాస్ట్‌కు లంచ్‌కు
మధ్యన తీసుకునే చిన్నపాటి బ్రేక్ ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలో
వెల్లడయ్యింది. అదే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని కూడా తేల్చారు.
దీని వలన అలసిపోవడం, తలనొప్పి, వెన్ను
నొప్పి వంటివి చాలా తక్కువగా ఉన్నట్లు గమనించారట. పైగా చిన్నపాటి విశ్రాంతి
తరువాత వచ్చే ఉద్యోగులు చాలా హుషారుగా పని చేస్తున్నారట.
0 comments:
Post a Comment