CSS Drop Down Menu

Monday, September 28, 2015

"దటీజ్ రజనీ"

220 పేజీల బౌండెడ్ స్క్రిప్టుని ఒక్క రోజులో చదివి,గుర్తు పెట్టుకోవటం సామాన్యమైన విషయం కాదు. అదీ నడి వయస్సు దాటిన రజనీకాంత్ వంటి సూపర్ స్టార్. అదే చేసారు రజనీ. ఆయన తన తాజా చిత్రం 'కబాలి' స్క్రిప్టుని ఒక్క రోజులో మొత్తం చదివేసారు. అంతేకాదు అందులో సీన్స్ ,డైలాగ్స్ విషయమై దర్సకుడుతో చర్చించారు. ఆయన ధారణ శక్తికి  జ్ఞాపక శక్తికి దర్శకుడు షాక్ కి గురి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా తెలియచేసారు. డైరక్టర్ రంజిత్ మాట్లాడుతూ...నేను ఓ వారం రోజులు పడుతుంది ఈ 220 పేజీల స్క్రిప్టు పూర్తిగా చదివి అర్దం చేసుకోవటానికి అనుకున్నాను. కానీ నా అంచనాలు తారు మారు చేసారు. ఒక్క రోజులో మొత్తం చదివేసి తెల్లారి నాతో డిస్కస్ చేసారు. సినిమాలో ఇంటర్వెల్ గురించి, అనేక డైలాగ్స్ గురించి నాతో చర్చించారు. ఆయనకు స్క్రిప్టుపై ఏర్పడ్డ కమాండ్ చూసి ఆశ్చర్యం వేసింది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు రంజిత్.

0 comments:

Post a Comment