సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చే
హీరోయిన్ల గురించి నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూపీ లాగుతారు. ఆమె
బయోడేటా, వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటారు. ఒకవేళ ఆమె ట్రాక్ రికార్డులో
లొసుగులు ఉన్నాయంటే.. ఇక ఆ హీరోయిన్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు
చుక్కలు చూపిస్తారు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చేటప్పుడు,
ముందు వారి ట్రాక్ రికార్డ్‌ని పద్దతిగా మెయింటెన్ చేసుకోవాలి.
ఇదిలా ఉంటా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి
ఎంట్రి ఇచ్చిన అనసూయ, ప్రస్తుతం రెండు సినిమాలకు ఓకే చెప్పేసింది. అయితే
అనసూయ బుల్లితెరలో పాపులర్ యాంకర్. తను యాంకర్‌గా ఉన్నప్పడు జరిగిన కొన్ని
విషయాలను టాలీవుడ్‌కి చెందిన కుర్ర హీరోతో చెప్పుకుందట. ఇప్పుడా కుర్ర హీరో
అనసూయ హాట్ ఎఫైర్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ప్రచారం చేస్తున్నాడట.
ఈ విషయం ఎలాగోలా అనసూయ చెవిన పడటంతో అనసూయ
అవాక్కైందట. ఒక్కసారి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన తరవాత ఇలాంటి
గాసిప్స్ కామన్ అని అనసూయకి ఇండస్ట్రీ పెద్దలు హితబోధ చేశారంట. దీంతో అనసూయ
ఈ రూమర్స్‌ని పట్టించుకోకుండా షూటింగ్ పనేంటో చేసుకుంటూ పోతుందట. మరి ఆ
కుర్ర హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
0 comments:
Post a Comment