CSS Drop Down Menu

Saturday, September 5, 2015

14 - 16ఏళ్లకే సెక్సుకు తొందరపడిపోతున్నారు ! ఎక్కడో తెలుసా ?

ఇండియాకు కూడా ఫారిన్ కల్చర్ వచ్చేస్తోంది. టీనేజీ వచ్చీ రాగానే సెక్సుకు తొందరపడిపోతున్నారా..!  14ఏళ్ల వయస్సులోనే అబ్బాయిలు, సుమారు 16ఏళ్ల వయస్సులో అమ్మాయిలు తమ తొలి శృంగార అనుభవం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారా..? నగర సంస్కృతిలో ఇది భాగమై పోతోందని ఓ సర్వేలో వెల్లడయింది. 
 
భారత్‌లో సెక్స్ అన్నది నిషిద్ధ పదమైనప్పటికీ, ఈ సర్వేలో ఇప్పుడు సెక్స్ఎడ్యుకేషన్ ఆవశ్యకతపై చర్చ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో తొలి లైంగిక అనుభవం పొందిన అబ్బాయిల సగటు వయస్సు 14ఏళ్ళు ఉండగా.. అమ్మాయిల వయస్సు కాస్త ఎక్కువగా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక ప్రచురించింది. 
 
దాదాపు 20నగరాల్లో 13నుంచి 19ఏళ్ళ మధ్య వయస్సున్న 15వేలమంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు.. 8.9 శాతం మంది  లైంగిక వ్యాధికి గురైనట్టు తేలింది. 6.3శాతం మంది అబ్బాయిలు, 1.3శాతం మంది అమ్మాయిలు ఫస్ట్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్ పొందారని, వీళ్ళ వయస్సు 14 - 16ఏళ్లమధ్య ఉందని సర్వే తెలిపింది. 


0 comments:

Post a Comment