CSS Drop Down Menu

Friday, September 11, 2015

"పేవ్‌మెంట్ పై పడుకున్న రోజుల్లో ట్రాప్ చేయాలని చూశారు" అంటున్న టాప్ హీరోయిన్ ?

ఆమె టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్. ఆమె జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు సినీ ఛాన్సుల కోసం బాలీవుడ్ ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో పేవ్‌మెంట్లపైన నిద్రించిందామె. చెప్పులరిగేలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగుతూ అలసిసొలసి ఫుట్‌పాత్‌పై పడుకుని నిద్రపోతుంటే కొందరు కుర్రాళ్లు ఆమెను వేధించిన సందర్భాలు ఉన్నాయి. 
 
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయా అంటే బాలీవుడ్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంగనా రనౌత్. నేటివిటీ కోసం అర్థనగ్నంగా సైతం నటించిన చరిత్ర ఆమెకు ఉన్నది. గ్యాంగ్‌స్టర్ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ సినీ ఛాన్సుల కోసం ఆఫీసులకెళితే ఎందరో ట్రాప్‌లో వేయాలని చూశారనీ, ఐతే వారందరినీ ఎదిరించి వారిపై పోలీసు కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించిందీ భామ. తన జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతోంది.


0 comments:

Post a Comment