CSS Drop Down Menu

Monday, September 14, 2015

"రజినీకాంత్‌"కు "భా.జ.పా" వార్నింగ్ ?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తమిళనాడు భాజపా నాయకులు వార్నింగ్ ఇచ్చారు. అంతగా వార్నింగ్ ఇచ్చే పని రజినీ ఏం చేశారనే కదా మీ డౌట్... మరేంలేదు... రజినీకాంత్ టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీనితో భాజపా నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 దీనికి కారణం ఏంటంటే.... టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దంలో మైసూరును కేంద్రంగా చేసుకుని పాలించాడు. ఆ సమయంలో తమిళులకు వ్యతిరేకంగా ఆయన చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలో టిప్పు సుల్తాన్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా కన్పిస్తారంటూ వారు నిలదీస్తున్నారు. తమిళుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంలో రజినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు సీనియర్ భాజపా నాయకుడు ఎల్ గణేశన్ అన్నారు. 
హిందువులపై దాడి చేసిన టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించడంపై రజినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ చిత్రంలో నటించేందుకు పలువురు తమిళ నటులు వెనుకంజ వేశారు. ఈ క్రమంలో రజినీకాంత్ కూడా తప్పుకుంటారని తాము అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.


0 comments:

Post a Comment