కోలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన
శ్రీదేవి చుక్కెదురైంది. ఇంగ్లీష్ వింగ్లీష్, తర్వాత కోలీవుడ్ సోషియో
ఫాంటసీ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు డబ్బింగ్
చెప్పేందుకు కోట్లాది రూపాయలు పుచ్చుకున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో పులి
డైరక్టర్లు శ్రీదేవిని ముప్పుతిప్పలు పెడుతున్నారని తెలిసింది. బాహుబలి
వద్దనుకుని పులికి ఓకే చెప్పేసిన శ్రీదేవి ప్రస్తుతం బెంబేలెత్తుతోంది.
‘పులి’ సినిమా విషయంలో చాలా ఆశలతో ఉన్న
శ్రీదేవి... చాలా రోజులు డేట్లిచ్చి.. ఎంతో ఇష్టంగా సినిమా పూర్తి చేసింది.
కానీ తీరా డబ్బింగ్ సమయంలో ఫైనల్ వెర్షన్ చూస్తే శ్రీదేవికి
దిమ్మదిరిగిపోయినట్లు సమాచారం. దర్శకుడు చింబుదేవన్ కథ చెప్పేటపుడు
శ్రీదేవి పాత్ర గురించి చాలా చెప్పాడట. అలా చెప్పినట్లే శ్రీదేవి మీద చాలా
సన్నివేశాలు కూడా చిత్రీకరించాడు.
కానీ డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే శ్రీదేవి
పాత్ర చాలా తగ్గిపోయిందట. లెంగ్త్ ఎక్కువైపోతుండటంతో ఎడిటింగ్‌లో భాగంగా
శ్రీదేవి నటించిన చాలా సన్నివేశాలకు కట్ చేసి.. పాత్రను బాగా
కుదించేసినట్లు తెలిసింది. దీంతో శ్రీదేవి వచ్చిన కోపం అంతా ఇంతా కాదని.. ఈ
విషయంలో దర్శకుడితో ఆమె గొడవ కూడా పడిందట. ఐతే లెంగ్త్ సమస్య గురించి
చెప్పి.. ఎలాగోలా డబ్బింగ్ చెప్పించారట.
ఐతే శ్రీదేవి మాత్రం దర్శకుడి సమాధానం మీద
సంతృప్తి చెందలేదని.. చాలా కోపంగా డబ్బింగ్ స్టూడియో నుంచి వెళ్లిపోయిందని
కోలీవుడ్ వర్గాల సమాచారం. శివగామి పాత్రను వద్దన్న శ్రీదేవి పరిస్థితి
ఏమైందో? శివగామి పాత్రతో రమ్యకృష్ణ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన
ఆనందంలో ఉంటే.. ‘పులి’లో తన పాత్ర గురించి ఏడుస్తోంది శ్రీదేవి. అసలే
శివగామి క్యారెక్టర్ వదులుకున్నానే అనే బాధలో ఉంటే.. ఇప్పుడు శ్రీదేవికి
కొత్త కష్టాలు తప్పట్లేదు.
0 comments:
Post a Comment