బట్టతలతో బయట తిరగలేకున్నానని అనుకునే
వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి పురుష
పుంగువలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు మందులు కూడా వాడుతుంటారు.
అయితే దాని వలన సంసార జీవితానికే ఎసరు వస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
వివరాలిలా ఉన్నాయి.
బట్టతలతో ఇబ్బంది పడుతూ ఒత్తైన జుట్టు కోసం
పురుషులు వాడే మందులు వారి లైంగిక జీవితాన్ని నాశనం చేస్తున్నాయట. తాజాగా
జరిగిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. ఇదే విషయాన్ని చికిత్స చేస్తున్న
వైద్యులు, తమ వద్దకు వచ్చే పేషంట్లకు చెప్పి మరీ ట్రీట్ మెంట్
ప్రారంభిస్తున్నారట.
బట్టతల తొలగించుకోవాలన్న పురుషుల గట్టి
పట్టుదల వైద్యుల హెచ్చరికలను డామినేట్ చేస్తుందట. దీంతో ముందైతే చికిత్స
ప్రారంభించండి... తర్వాత చూద్దామంటూ వారు వైద్యులకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చేస్తున్నారట. ఈ తరహా మందుల్లో ఫినాస్టెరాయిడ్, డూటాస్టెరాయిడ్
(ప్రోస్కార్, అవోడార్ట్)లు ఉంటాయి.
వీటి కారణంగానే ఈ మందులను వాడే వారి లైంగిక
సామర్ధ్యం తగ్గిపోతుందని తేలింది. అయితే ఈ ప్రభావం కొందరిలో
తాత్కాలికంగానే కనిపించినా, మరికొందరిలో పెను ప్రభావాన్నే చూపుతుందట.
లైంగిక సామర్థ్యం తగ్గడంతోపాటు, కొందరిలో అనాసక్తత చాలా ఎక్కువగా
కనిపిస్తుందట.
0 comments:
Post a Comment