మారుతున్న కాలంతో పాటు యువతీ యువకుల పోకడలు
కూడా విపరీతంగా మారిపోతున్నాయి. దీంతో అనేక చెడు అలవాట్లకు
బానిసలవుతున్నారు. ఇలాంటి వాటిలో మద్యపానం ఒకటి. అయితే, యువతులు మద్యపానం
చేయడం వల్ల అనేక సమస్యలకు లోనవుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో
వెల్లడైంది. ముఖ్యంగా ఊహించని, అనాలోచిత, అనారక్షిత శృంగారానికి మద్య సేవనం
ప్రేరేపిస్తున్నట్టు తేలింది.
సుఖవ్యాధులకు చికిత్స చేసే బల్టీమోర్
క్లినిక్‌కు వచ్చిన 20 మంది ఆఫ్రికన్ - అమెరికన్ మహిళల వద్ద లోతైన అధ్యయనం
చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా ఆరు నెలలుగా
మద్యం సేవిస్తున్నవారు, ఆల్కహాల్ ప్రభావం కారణంగా సెక్స్‌లో పాల్గొన్నవారు
ఉన్నారు. మద్యం సేవించిన మహిళల్లో ప్రధానంగా ఐదు ఊహించని పరిణామాలు
సంభవిస్తున్నాయి.
వాటిలో కొత్తకొత్త భాగస్వాములతో సంభోగంలో
పాల్గొనడం, ప్రత్యామ్నాయ శృంగార చర్యలు, యానల్ సెక్స్, మొరటు శృంగారం,
అనారక్షిత శృంగారం, అత్యాచారం వంటి సంఘటనలు జరుగుతున్నట్టు తేలింది. ఈ
అధ్యయనం నివేదికను ఉమెన్స్ హెల్త్ సంచికలో ప్రచురించారు.
0 comments:
Post a Comment