మన దేశంలో అతి తక్కువ కాలంలోనే పెళ్లి
వ్యవస్థ మాయమైపోతుందని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు
చేశారు. తాజాగా "365 డేస్" సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న పూరి
మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆధునిక సమాజంలో తల్లిదండ్రుల కంటే కూడా స్నేహ బంధమే
విలువైనదని అన్నారు. అందువలనే తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహితుల లాగే
మెలుగుతున్నారని గుర్తుచేశారు.
దీన్ని బట్టి చూస్తే భారత దేశంలో అతి
కొద్ది కాలంలోనే పెళ్లి అనే పదం వినపడదని విశ్వాసం వ్యక్తంచేశారు. మనకు
ఇష్టమైన స్నేహితులను మనం పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జమైకా,
స్పెయిన్ లా తయారవుతుందో లేదో తెలియదు కానీ భారత్‌లో పెళ్లిళ్లు ఉండవని
పూరీ తెలిపారు.
0 comments:
Post a Comment