CSS Drop Down Menu

Wednesday, May 6, 2015

'' కమల్ కాళ్లపై పడిన ఖుష్బూ'' ?

కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ఉత్తమ విలన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హీరో కమల్, డైరెక్టర్ రమేష్ అరవింద్‌లు ఇద్దరూ కలిసి కోలీవుడ్‌లో తమ మిత్రులకు ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ ఏర్పాటు చేశారు. ఈ ప్రివ్యూ చూసిన నటి ఖుష్బు.. హీరో కమల్‌ని పొగడ్తల్లో ముంచెత్తింది. విజువల్స్, డైలాగ్స్ అన్ని అదుర్స్ అంటూ యూనిట్‌ని అభినందించింది. మూవీని గొప్పగా డైరెక్ట్ చేయడంలో రమేష్ అరవింద్ సక్సెస్ అయ్యాడంటూ ఆయనకూ ఓ కితాబిచ్చిన ఖుష్బు సినిమాలో కమల్ పర్‌ఫార్మెన్స్ సూపర్బ్ అంటూ ఇదే ప్రెస్‌మీట్‌లో కమల్ పాదాలు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకుందట. ఇంకేం... ఖుష్బు చేసిన ఈ ఒక్క పనితో 'ఉత్తమ విలన్'కి కావాల్సినంత ప్రచారం వచ్చిపడింది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎవరి నోట విన్నా... '' కమల్ కాళ్లపై పడిన ఖుష్బూ'' అనే టాపికే వినిపిస్తోంది. 

0 comments:

Post a Comment