అదృష్టం ఏ రూపంలోనైనా వచ్చి తలుపు
తట్టవచ్చు. అలాంటి అదృష్టమే 84 బామ్మ గ్లోరియా మెక్ కెన్జీని వరించింది. ఈ
క్రమంలో కెన్జీ.. అతిపెద్ద 'లొట్టో' లాటరీ విజేతగా నిలిపింది. 590.5
మిలియన్ డాలర్ల (సుమారు 3,750 కోట్లు) బహుమతిని కెన్జీని సొంతం చేసుకుంది.
వాస్తవానికి ఆమెకొన్న లాటరీ టిక్కెట్
మరెవరికో దక్కాల్సింది. కానీ, వయసు మీద పడిన ఆమెను లాటరీ టిక్కెట్లమ్మే
షాపు వద్ద చూసిన ఓ వ్యక్తి ముందు ఆమెను టిక్కెట్ తీసుకోమని తాను వెనక్కు
జరిగాడు. అదే ఆమె అదృష్టం.
ఇదిలావుండగా, పన్నులన్నీ పోను ఆమె బ్యాంకు
ఖాతాలోకి 278 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1766 కోట్లు) జమ అవుతాయట. ఇది
కూడా చిన్న మొత్తం ఏమీ కాదు. ఈ డబ్బులో కొంత భాగాన్ని తన స్వగ్రామంలోని
పాఠశాలకు సాయంగా ఇస్తానని గ్లోరియా అంటోంది.
0 comments:
Post a Comment