CSS Drop Down Menu

Saturday, May 2, 2015

వేసవిలో పుచ్చకాయ తింటే ?


పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ - ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. 
 
వీటివల్ల ఆందోళన, చికాకు తగ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపు చేస్తుంది. పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకో పీన్ కెరటినాయిడ్ క్యాన్సర్లు, గుండెజబ్బులు, కంటి లోపల పొర క్షీణించడం వంటి వాటిని రాకుండా నిరోధిస్తుంది. 
 
పుచ్చకాయలో అధిక మొత్తాల్లో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీనిని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. 
 
కామెర్లు, పైత్యపు వికారాలు, తలనొప్పి, నోరు తడారిపోవటం, ఇన్ఫెక్షన్లు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు పుచ్చకాయ రసానికి సమాన భాగం మజ్జిగ కలిపి తగినంత ఉప్పు చేర్చి తీసుకోవాలి.

0 comments:

Post a Comment