ఇటీవల చాలా మంది హీరోయిన్లు నగ్నంగా
చేసేందుకు సిద్దంగానే ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం షూటింగ్
చేేసే వారు కెమెరా మెన్లుగా కాకుండా, కెమెరా ఉమెన్ అయితే కంఫర్ట్‌గా
ఉంటుందని అంటున్నారు. దాంతో దర్శకనిర్మాతలు అటువైపు మొగ్గు చూపుతున్నారు.
ఇటీవల నటి రాధిక ఆప్టే, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నటించిన ఓ లఘు చిత్రం
కోసం నగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే.
ఆ లఘు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో
అక్కడికి మగవారికి అవకాశం కల్పించలేదట అనురాగ్ కశ్యప్. రాధికా ఆప్టేతో
న్యూడ్ సీన్స్ తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు
తీసుకున్నామని అనురాగ్ కశ్యప్ వివరించాడు. అయితే ఆ వీడియోని ప్రపంచమంతా
చూసేసింది కదా…అన్నవారు లేకపోలేదు.
ఇక కొత్త సినిమా 'త్రిబుల్ ఎక్స్' కోసం
ఏకంగా లేడీ సినిమాటోగ్రాఫర్‌ని పెట్టుకుంది ప్రముఖ బాలీవుడ్ నిర్మాత
ఏక్తాకపూర్. కికో అనే సినిమాటోగ్రాఫర్‌ని ఈ సినిమా కోసం తీసుకున్నారు.
దర్శకుడు కెన్ ఘోష్ ఈ సినిమా గురించి చెబుతూ, ఎరోటిక్ సీన్స్ విషయంలో మహిళా
నటులు సౌకర్యం కోసమే ఈ ఏర్పాట్లు అని వివరణ ఇచ్చాడు.
ఈ విషయం తెలిసిన వాళ్లు మాత్రం.. నగ్నంగా
నటించే సమయంలో ఉన్న అభ్యంతరం, ఆ వీడియోని అందరూ చూసేటప్పుడు ఆయా నటీనటులకు
లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని అంటున్నారు. ఇందుకు సదరు హీరోయిన్లు మాత్రం
నేరుగా చిత్రీకరణ చూడడం వేరు, వెండితెరపై సినిమా రూపంలో చూడడం వేరని తమ
అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక మీదట కెమెరా ఉమెన్‌లకు అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
0 comments:
Post a Comment