ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ ది చాల విభిన్నమైన మనస్తత్వం.. సినిమాల్లో
తప్ప ఆయన బయట పెద్దగా కనిపించరు. తన సినిమా ఫంక్షన్లకే తప్ప.. ఇతరుల
కార్యక్రమాలకి కూడా పెద్దగా వెళ్లరు. ఎవరితో నూ క్లోజ్ రిలేషన్ షిప్ మెయిన్
టెయిన్ చేయని మహేష్.. మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని అంతా
అనుకుంటారు. కాని తాజాగా మహేష్ చేసిన పని తెలిస్తే వారు తమ అభిప్రాయాన్ని
మార్చుకోవాల్సిందే.
అమెరికాలో త్వరలో జరిగే తానా సభలకు
అటెండయ్యేందుకు మహేష్ కోటిన్నర అడిగాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఏదో
క్రేజ్ కోసం పిలిస్తే మరీ అంత డిమాండ్ చేయడం సరికాదని అంతా బ్యాడ్ గా
ఫీలయ్యారు కూడా. కాని మహేష్ ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా
తీసుకోలేదట.తానా వారు ఇచ్చిన ఆ డబ్బుని ప్రిన్స్ నేరుగా పేద పిల్లల సాయం
చేసే సంస్థ’ హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ కి గుప్తదానం చేసినట్టుగా
తెలిసింది.వేల రూపాయలు సాయం చేస్తేనే చాలా ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో మహేష్ ఇంత
పెద్ద మొత్తంలో దానం చేసి కూడా బయటకు చెప్పుకోలేదు.
తానా సభకు అంత
డిమాండ్ చేయడం సరికాదంటూ ఇటీవల ఓ పార్టీలో కొందరు మహేష్ పై బ్యాడ్ గా
మాట్లాడుకుంటుండగా.. అక్కడే ఉన్న ఆయన సన్నిహితులు వారిని వారించి అసలు
విషయం చెప్పారట.. అలా మహేష్ గుప్తదానం చేసిన మ్యాటర్ కాస్త వెలుగులోకి
వచ్చింది. ఏ యాడ్ చేసి ఎంత సంపాదిద్దామా అని ఆలోచించే స్టార్లున్న
రోజుల్లో.. మహేష్ ఏ మాత్రం ఆలోచించకుండా కోటిన్నర రూపాయలను దానం చేయడం నిజంగా
అభినందనీయం.
0 comments:
Post a Comment