మంచు మనోజ్-ప్రణతిల పెళ్లి వేడుకకు సినీ
ప్రముఖులు, రాజకీయ, వ్యాపారవేత్తలు చాలామంది హాజరయ్యారు. ఐతే ఈ పెళ్లి
వేడుకలో ఇద్దరు వ్యక్తులు నవ్వుతూ కుశలప్రశ్నలు వేసుకుంటూ సరదాగా ఉండటం
చూసిన వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరయా అంటే... ఈనాడు
సంస్థల అధినేత రామోజీరావు, సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్
మోహన్ రెడ్డి.
మంచు మనోజ్ పెళ్లికి వీరిద్దరు కూడా
హాజరయ్యారు. పెళ్లికి వచ్చిన రామోజీరావును చూసి జగన్ మోహన్ రెడ్డి
నమస్కరిస్తూ పలుకరింపుగా నవ్వారు. కుర్చీలో కూర్చున్న రామోజీరావు పైకి లేచి
ప్రతినమస్కారం చేశారు. ఆ తర్వాత ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని
కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
బిజినెస్ ఎలా సాగుతోందని జగన్ మోహన్ రెడ్డి
రామోజీరావును ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు. ఆ తర్వాత రామోజీరావు ఇటీవల
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలను ఉద్దేశిస్తూ... ఎండలో చాలా
కష్టపడుతున్నావ్ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఇద్దరూ కొద్దిసేపు
మాట్లాడుకున్నారు.
0 comments:
Post a Comment