CSS Drop Down Menu

Thursday, May 7, 2015

" శృంగారం ఫై ఎక్కువ మక్కువ చూపించే దేశాలేంటో" తెలుసా ?

మనం పుట్టింది  అందుకే? అనుకునే వారు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. శృంగారం లేని ఈ జీవితం వృధా అనుకునే వారూ ఎక్కువే. ఏ ఏ దేశాలు శృంగారంపై ఎంతెంత ఆసక్తిని కనబరుచుతున్నాయో తెలుసుకోవాలనుకునే ఓ చిన్న ఆలోచన వచ్చింది ఓ కండోమ్స్ తయారీ సంస్థకు. అక్కడ సెక్సు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారనే అంశాలపై ఆ సంస్థ పరిశోధన చేసింది. దీని ఆధారంగా గ్రేడింగ్ కూడా ఇచ్చేసింది. లైంగిక ఇష్టాలపై ఆసక్తి కనబరిచే దేశాల జాబితాను తయారు చేశారు. వాటిలో మనం ఎక్కడున్నాం.? ఏ దేశం మొదటి స్థానంలో ఉంది. రండి.. తెలుసుకుందాం. 
 
కండోమ్స్ తయారీ సంస్థ ఆన్‌లైన్‌లో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. అన్నింటిలోనూ ముందుండే విచ్చలవిడి శృంగారానికి వంతపాడే ఫ్రాన్స్, అమెరికా, యూకెలు టాప్-10లో లేవు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మోస్ట్ రొమాంటిక్ కంట్రీ  అయిన ఫ్రాన్స్‌‌కు టాప్-10లో లేనేలేదు. 
 
సాధారణంగా శృంగారం అంటే అది నాలుగు గోడల మధ్యన మాత్రమే జరిగేదని, బహిరంగంగా మాట్లాడుకోవడానికి కూడా వీలు లేని అంశమని భావించే మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా... ? ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ నిలవగా, తర్వాత స్థానాల్లో స్పెయిన్, ఇటలీ, బ్రెజిల్, గ్రీస్, నెదర్లాండ్స్, మెక్సికో, భారత్ (8వ స్థానం), ఆస్ర్టేలియా, నైజీరియాలు వున్నాయి. 
 
11వ ప్లేస్‌లో జర్మనీ, 12లో చైనాలు నిలిచాయి. సెక్స్ అనేది ఆరోగ్యపరంగా మంచిదేనని, భాగస్వాముల మధ్య ఒకరిపై మరొకరికి విశ్వాసం పెరగడానికి దోహదం చేస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఆయుష్షుపరంగా లైంగిక తృప్తి తగ్గవచ్చని, ఐతే, మానసికంగా, శారీరకంగా వున్నప్పుడు దీనికి పరిమితి అంటూ ఏమీ వుండదని తేలింది.  

0 comments:

Post a Comment