CSS Drop Down Menu

Tuesday, May 12, 2015

"అలీ పై ఝాన్సీ సెటైర్లు"


సినిమా సెలబ్రేటీలందరినీ తన బూతు జోక్స్ తో ఆటపట్టించే అలీ ఈమధ్య కాలంలో మీడియాలో తెగ సందండి చేస్తున్నాడు. యాంకర్ సుమ అలీ బూతు జోక్స్ ని తట్టుకోలేక ఏకంగా సుమ అలీకి వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వార్తలని అలీ ఖండించడమే కాకుండా తనకు వార్నింగ్ ఇచ్చే వ్యక్తులు ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు అని అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఇక నిన్న రాత్రి జరిగిన కిక్ 2 ఆడియో వేడుకలో యాంకర్ ఝాన్సీ అలీని దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

నిన్న జరిగిన ‘కిక్ 2’ ఆడియో వేడుకలో ఝాన్సీ కొద్ది సేపు ప్యాంటు, షర్టు వేసుకుని ఆపై కోటు కూడ వేసుకుని అలీ లా డ్రస్ చేసుకుని కొంత సేపు నాపేరు బాలీ అని అంటూ నేను ఏమి మాట్లాడినా బూతు అంటున్నారు. అందుకే నా నోటి చుట్టూ ప్లాస్టర్ వేసుకున్నాను అని కామెంట్లు చేస్తూ అలీ బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ అలీ పై సెటైర్లు వేసింది.ఈ సెటైర్లు ‘కిక్ 2’ ఆడియో వేడుకకు వచ్చిన అతిధులకు అభిమానులకు కొద్ది సేపు మంచి కిక్ ను ఇచ్చాయి.

అయితే సమంత దగ్గర నుంచి అందర్నీ టార్గెట్ చేస్తూ వస్తున్న అలీ దృష్టికి ఝాన్సీ వేసిన సెటైర్లు వెళితే అలీ రివర్స్ పంచ్ లు ఎలా ఉంటాయో అనే మాటలు ఆ ఆడియో ఫంక్షన్ లో వినిపించాయి. అయితే ఝాన్సీ ప్రజెంట్ చేసిన ఈ స్కిట్ యధాలాపంగా చేసిందా లేక నిజంగానే అలీని టార్గెట్ చేసుకుంటూ చేసిందా అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా నిన్న జరిగిన ‘కిక్ 2’ ఆడియో వేడుకలో ఝాన్సీ బాలీ లుక్ టాక్ ఆఫ్ ది ఈవెంట్ గా మారింది..
                              

0 comments:

Post a Comment