గోదావరి, కృష్ణా పుష్కరాలు అని చెబితే
తెలంగాణ నుంచి మనం కూడా సన్నాసుల్లా వెళ్లి విజయవాడ ప్రకాశం బ్యారేజీ
వద్దనో, గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి దగ్గరకో వెళ్లి గుండు
కొట్టించుకుంటామని కేసీఆర్ సెటైర్లు విసిరారు.
గోదావరి నది వందల కిలోమీటర్లు తెలంగాణలో
పయనించి కేవలం 60 కిలో మీటర్ల లోపే ఆంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తుందనీ,
అలాంటిది పుష్కరాలు వారు నిర్వహించడమేమిటో తనకు అర్థం కాదన్నారు. వందల
కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరి నది ఒడ్డున బాసర సరస్వతి దేవి
ఆలయం, కాళేశ్వరంలో మహేశ్వరుని ఆలయం, మంధనిలో గౌతమేశ్వర స్వామి ఆలయంతోపాటు
రాముడు, సరస్వతి దేవాలయాలున్నాయనీ, అక్కడ పుష్కర స్నానం చేసి
గుండు కొట్టించుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా తెలంగాణ
నాయీబ్రాహ్మణులకు పని దొరుకుతుందని చెప్పుకొచ్చారు.
0 comments:
Post a Comment