వారు ఎంతటి వారైనా సరే.. ఆ కోర్సు
పూర్తవ్వాలంటే ఆ ప్రొఫెసర్ చెప్పిన పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్ష రాయాలంటే
దుస్తులు విప్పేయాల్సిందే. నగ్నంగా పరీక్ష రాయకపోతే ఫెయిల్ కావడం ఖాయం.
ఇదేదో తమాషాకు చెప్పే మాట కాదు. నిజం తెలుసుకోవాలంటే అమెరికాకు చెందిన
కాలిఫోర్నియాలోని శాండియాగో యూనివర్శిటీకి వెళ్ళాల్సిందే.
ప్రస్తుతం ఈ యూఎస్‌లో ఈ విషయం తీవ్ర దుమారం
రేపుతోంది. ఇంతకీ స్టూడెంట్ నగ్నంగా పరీక్ష రాయడానికి కారణమేంటి? ఇది
కోర్సులో భాగమా? లేక ఆ ప్రొఫెసర్‌కు పిచ్చా అంటూ అనేక ప్రశ్నలు
తలెత్తుతున్నాయి. విజువల్ ఆర్ట్‌కు సంబంధించి రెండేళ్ల కోర్సును
కాలిఫోర్నియాలోని శాండియాగో యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
ఈ కోర్సును ప్రొఫెసర్ రికార్డో డోమింజ్
భోదిస్తుంటాడు. విద్యార్థులు పాస్ కావాలంటే చివరి పరీక్షకు నగ్నంగా రాయాలి.
ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఒక విద్యార్థిని
తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. స్థానిక ఓ టీవీ ఛెనల్‌కు
వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రొఫెసర్
మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు. తాను దశాబ్దంగా ఇలాగే
చేస్తున్నానని, ఇప్పుడు ఎందుకు వివాదం అవుతుందని ప్రొఫెసర్ రికార్డో
ప్రశ్నిస్తున్నాడు.
నగ్న ప్రదర్శన ఇవ్వడానికి అనేక
మార్గాలున్నాయని చెప్పారు. చాలా కాన్వాసుల మీద నగ్న చిత్రాలు ఉంటాయని
చెపుతున్నారు. నిజంగా చూసినవి కాకపోతే ఆర్టు ఎలా వస్తుందని
ప్రశ్నిస్తున్నారు. ఆ పరీక్షను అలా రాయకపోతే వారే నష్టపోతారని
వాదిస్తున్నారు. విజువల్ ఆర్ట్స్ కోర్సుకు ఇది అవసరమని కుండబద్దలు
కొట్డేశాడు. ఈ తతంగం బయటకు వచ్చిన తర్వాత యూనివర్శిటీ అధికారులు మాత్రం ఈ
కోర్సు పూర్తి కావడానికి నగ్నంగా పరీక్ష రాయనవసరం లేదని ప్రకటించారు.. ఈ
ప్రొఫెసర్ వాదన సరైందా..? కాదా అనే అంశంపై ఇప్పుడు యూఎస్‌లో తీవ్ర చర్చ
జరుగుతోంది.
0 comments:
Post a Comment