CSS Drop Down Menu

Saturday, May 16, 2015

"ఏడవడానికి" ఓ హోటల్ ?

ఏం తనివితీరా ఏడ్వడానికి కూడా లేదా..  ఏడ్వను కూడా ఏడ్వనివ్వరా... ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా అనే వాదించే వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఇక ఆ దిగులు లేదు. జపాన్ కు చెందిన ఓ హోటల్ ఈ సౌకర్యాన్ని విలాసవంతంగా అందిస్తోంది. ఏడ్వడంలో కూడా విలాసం ఉంటుందా.. అది కాదండీ బాబు కన్నీళ్ళు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్లు వంటి సౌకర్యాలు బోలెడు. వివరాలిలా ఉన్నాయి. 
 
వెక్కివెక్కి ఏడవడానికి ఓ హోటల్.. మీ మనసులో బాధంతా తీరిపోయేలా బోరుమనడానికో హోటల్. నిజం.. జపాన్‌లోని టోక్యోలో ఉన్న మిత్సుయ్ గార్డెన్ హోటల్ ఇలాంటి సదుపాయాన్నే కల్పిస్తోంది. అదీ మహిళలకు మాత్రమే సుమండీ. దీని కోసం ఆ హోటల్ ప్రత్యేకమైన గదులను కేటాయించింది.
 
ఇందులో ఏడుపొస్తే.. తుడుచుకోవడానికి ఖరీదైన టిష్యూలతోపాటు మనసును కదిలించేసి.. కన్నీళ్లు తెప్పించేసే సినిమాల డీవీడీలు ఉంటాయట. ఇక మీ ఇష్టమన్నమాట. కావాల్సినంత సేపు కన్నీరు పెట్టొచ్చు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని పొందాలంటే రోజుకు రూ.5300 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకేం ఏడ్వాలంటే జపాన్ దారి పట్టండి. 

0 comments:

Post a Comment