నైజీరియాలోని ఓ రెస్టారెంట్‌లో మనిషి
మాంసాన్ని ఓ వంటకంగా చేసి వడ్డిస్తున్నారు. దీనికి బిల్లుగా 700 నైరాల
(రూ.220) చొప్పున బిల్లు కూడా వేశారు. ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు వేశారంటూ
అతిథి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఆ హోటల్ సిబ్బందితో
పాటు రెస్టారెంట్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన
ఈ వివరాలను పరిశీలిస్తే..
నైజీరియాలోని అనంబ్ర ప్రాంతంలోని ఓ హోటల్
లో మనిషి మాంసంతో వంటకాలు చేసి వడ్డిస్తున్నారంటూ సమాచారం అందడంతో ఆ
హోటల్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అకస్మాత్తుగా పోలీసులు దాడి
చేయడంతో అక్కడ కనిపించిన వాస్తవిక దృశ్యాలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. గదిలో
ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టిన రెండు మనిషి తలలను కనుగొన్నారు. అవి
తాజావి అనడానికి గుర్తుగా వాటి నుంచి రక్తం కారుతోందని పోలీసులు
వెల్లడించారు.
తాము వెళ్లేటప్పటికి ఆ హోటల్ సిబ్బంది
మనిషి మాంసం కోస్తుండటాన్ని చూసి నిర్ఘాంత పోయామని పోలీసులు చెప్పారు.
దీంతో ఆ హోటల్ సిబ్బందిని అరెస్ట్ చేసి ఆ హోటల్‌ను సీజ్ చేసినట్టు
చెప్పారు. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఒక మత గురుకు తనకు ఒకసారి 700
నైరాల(రూ.220) బిల్లు వేశారని.. ఎందుకంత బిల్లు అయ్యిందని హోటల్ సిబ్బందిని
అడిగితే... మీరు తిన్నది మనిషి మాసం దీని ఖరీదు ఇంతే... అని చెప్పారు.
0 comments:
Post a Comment