CSS Drop Down Menu

Wednesday, May 20, 2015

"ఆమరణ నిరాహార దీక్ష" చేపట్టనున్న " పవన్" ?

ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమయ్యే భూములని సేకరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న భూ సమీకరణ విధానానికి వ్యతిరేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ హోదాలో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం విధానాలని నిరసిస్తూ మే 23వ తేదీ నుంచి ఆయన దీక్షకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలొస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లయితే ఏకంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకే రెడీ అవుతున్నారంటూ వార్తా కథనాల్ని ప్రచురించాయి. చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ విధానాన్ని మార్చుకోకపోతే తన వైపు నుంచి ఉద్యమం తప్పదనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ పంపించినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. 
అయితే వాస్తవానికి ఈ విషయంలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏపీ ప్రభుత్వం తీరుపట్ల తన అభిప్రాయం ఏంటో, అవలంభించాలనుకుంటున్న విధానం ఎటువంటిదో స్పష్టంచేయలేదు. కనీసం తాను దీక్షకు దిగడానికి సిద్ధపడినట్లు వస్తున్న వార్తలపైనైనా పవన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పవన్ దీక్ష చేస్తున్నాడని వస్తున్న ప్రచారాన్ని నమ్మాలా లేక పవన్ అధికారిక ప్రకటన కోసం వేచిచూడాలా అని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై పవన్ ఏమని స్పందిస్తారోనని ఆయన అభిమాన సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

0 comments:

Post a Comment