CSS Drop Down Menu

Thursday, May 21, 2015

"కిరాణా దుకాణాల్లో బీర్"

బీర్ బాబులకు త్వరలో చల్లని శుభవార్త! ఇకపై బీర్‌ని కొనుక్కునేందుకు మద్యం షాపులకు వెళ్లనక్కర్లేదు.. కిరాణా దుకాణాల్లో హాయిగా తీసుకోవచ్చు.. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ మేరకు ఆలిండియా బ్రేవర్స్ అసోసియేషన్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
ఈ రోజుల్లో వేగంగా అమ్ముడయ్యే వస్తువుల్లో బీరు కూడా ఒకటి. ఏ కాలంలోనైనా దీనికి డిమాండ్ అలాగే వుంటోంది. వేసవి వస్తే సేల్స్ అధికంగా పెరుగుతాయి. బీర్ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకున్న బ్రేవర్ అసోసియేషన్, అందుకు అనుగుణంగా నిబంధనలు మార్చాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. బీరును మద్యంలా చూడడమే తప్పంటోంది ఆ కంపెనీ! మిగతా బాటిల్స్‌లో 42 శాతం వరకు ఆల్కహాలు ఉంటే, బీరులో కేవలం ఐదు నుంచి ఎనిమిది శాతం వుంటుందని అంటోంది. ఈ నేపథ్యంలో బీరుని వినియోగ వస్తువుగా మార్చితే వాటి అమ్మకాల వృద్ధి రేటు కూడా పెరుగుతుందని ఆలిండియా బ్రేవర్స్‌ అసోసియేషన్‌ ఎఐబిఎ డైరెక్టర్‌ జనరల్‌ సోబన్‌ రాయ్‌ అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు బీరుపై 50 నుంచి 85 శాతం పన్నుల భారం మోపగా, గోవా, పాండిచ్చేరి 50శాతం వుంది. దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బీరుని తయారు చేస్తున్నాయి. ఈ ఇండస్ర్టీ వృద్ధి ఆరుశాతం వుండగా, పన్నులు, ఇతర ఆంక్షలు తొలిగిస్తే మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 

0 comments:

Post a Comment