ప్రపంచంలోని చాలా దేశాల మహిళలు ఒక మార్గంలో
నడుస్తుంటే దక్షిణాఫ్రికాలోని కొందరు మహిళలు మరో మార్గంలో నడుస్తున్నారు.
‘మమ్మల్ని మీరు రేప్ చేయడం ఏంటి? మేమే మిమ్మల్ని రేప్ చేస్తా’మంటూ
పురుషులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన సంఘటనలో ముగ్గురు
యువతులు ఓ పురుషుడిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలిలా
ఉన్నాయి.
గాటెంగ్ నగరంలో మహిళలు తుపాకీతో బెదిరించి
33 ఏళ్ల యువకుడిని బీఎండబ్ల్యూ కారులో తీసుకెళ్లారు. ఆ యువకుడిని 500 కిలో
మీటర్ల దూరం తీసుకెళ్లారు. నిర్మానుష ప్రాంతంలో కారును ఆపి అతని చేత
బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ముగ్గురు యువతులు అతనిపై లైంగికదాడికి
పాల్పడ్డారు. అనంతరం అతడిని కారులోంచి తోసేసి వెళ్లిపోయారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాటెంగ్ నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
0 comments:
Post a Comment