ఏ ప్రభుత్వం వచ్చినా పెట్రోల్ ధరలు పెరగడం
ఖాయమైపోయింది. మోదీ అయినా.. మన్మోహన్ అయినా.. ఒకటే పెట్రోల్ ధరలు పెంచి
జనాన్ని బాదేయడం.. దానికి క్రూడ్ ఆయిల్ ధరలను సాకు చూపడం మామూలై పోయింది.
ఇది నిజమా...? పెట్రోల్ ధరలు ఎలా పెంచుతున్నారు? ఓ లెక్క లేదా..? ఎలా పడితే
అలా పెంచేస్తున్నారా..! క్రూడ్ ఆయిల్ ధరలు కహానీలేనా..!! ప్రభుత్వం చెప్పే
లెక్కలకు పెంచే ధరలకు సంబంధం లేదా..! చూద్దాం రండీ.
ఏ ప్రభుత్వం ఉన్నా జనాన్ని బాదడమే..
ఒక్కసారి చూద్దాం. 2007-08 మధ్యకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక బేరల్
క్రూడాయిల్ ధర రూ. 141.71 నుంచి $. 147.02 మధ్య ఉంది. అప్పుడు మనదేశంలో ఒక
లీటరు పెట్రొల్ రూ. 70 రూపాయిలు లోపే. ప్రస్తుతం క్రూడాయిల్ ధర $.64. కానీ
పెట్రోల్ ధర మాత్రం రూ. 75. వాస్తవంగా తగ్గాల్సిన ధరలు పెరిగాయి.
ఆ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ. 40
ఉండాలి. కానీ ఎందుకు రూ. 75 ఉంది. ఇది ప్రభుత్వ పెద్దల మాయ. జనం నుంచి
పెద్దగా ఆదాయం వచ్చేది ఒక పెట్రోల్, డీజల్ నుంచి మాత్రమే. అందుకే మన
ప్రభుత్వ పెద్ద వినియోగదారులపై వాయింపుడు మొదలు పెట్టారు. మన దేశంలో ధరలు
మనకన్నా వెనుకబడిన పాకిస్తాన్,బంగ్లాదేశ్,నేపాల్ తదితర దేశాలలో చాలా
తక్కువగా ఉన్నాయి.
గతంలో అంతర్జాతీయ మర్కెట్లో భారీ తేడాలు
వస్తే బ్యాలన్స్ చేయడానికి ఆయిల్ పూల్ అకౌంట్ ఉండేది దాన్ని గతంలో వాజ్
పేయి ప్రభుత్వం రద్దు చేసింది ప్రభుత్వ జోక్యం లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్ లో మరో సమస్య రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి బాగలేదని బాబు గారు
అదనంగా పన్నులు విధించారు. పలితం మన రాష్ట్రంలో ధరలు మరీ ఎక్కువ.
0 comments:
Post a Comment