ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తాజా సినిమా ‘హ్యాపీ న్యూఇయర్' బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, దీపిక, అభిసేక్ బచ్చన్, బోమన్ ఇరానీ మఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీవసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో దాదాపు 237 కోట్లు వసూలుచేసి, 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తక్కువ కాలంలోనే రూ. 300 కోట్లు సాధించిన ఘనతకు అమితాబ్ బచ్చన్ సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే అమితాబ్ భార్య జయ బచ్చన్ మాత్రం షాకింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ చిత్రాన్ని పనికిమాలిన సినిమాగా పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో తాను చూసిన పనికిమాలిన సినిమా ఇదేననీ, కేవలం తన కొడుకు అభిషేక్ నటించినందునే ఆ సినిమాని తాను చూశాననీ ఆమె ఆ సినిమాను ఎండగట్టారు. ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదనీ, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చురకలంటించారు. స్వయంగా జయ బచ్చన్ ఈ కామెంట్స్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.
0 comments:
Post a Comment