CSS Drop Down Menu

Tuesday, November 11, 2014

ఏ రోజు మరణిస్తారో ? చెప్పేసే యాప్ !

పుట్టిన వానికి మరణం తప్పదు... మరణించిన వానికి పుట్టుక తప్పదు అని కృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ ఆ మరణం ఎప్పుడు వస్తుందోనని చాలామంది భయపడుతుంటారు. కొందరు మరణం తప్పదు కదా... అని అంటుంటారు. ఐతే తమతమ మరణం ఎప్పుడు సంభవిస్తుందోనన్న ఆలోచన చాలామందిలో మెదులుతుందనేది వాస్తవం. అలాంటి వారికోసం కొత్తగా ఓ యాప్ వచ్చేసింది. 
 
డెడ్ లైన్ అనే పేరుతోనే వచ్చేసిన ఈ యాప్ ను ఐఫోన్లో అప్ లోడ్ చేసుకుని, అందులో ఉన్న హెల్త్ కిట్ టూల్ నుంచి జోడించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని అది సదరు వ్యక్తి ఏ రోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఐతే అది దేన్ని ఆధారం చేసుకుని మరణ తేదీని చెపుతుందంటే... ఆరోగ్య పరిస్థితిని, దాన్ని ఆధారం చేసుకుని ఆయుఃప్రమాణం అంచనా వేసి ఫలానా అప్పుడు మరణం సంభవించే అవకాశం ఉందని చెప్పేస్తుందట. ఈ విషయాన్ని యాప్ రూపకర్తలు చెప్పారు. 
 
హెల్త్ కిట్ టూల్ లో మరణ తేదీని కనుగొనగోరే వ్యక్తి తను ఎంతసేపు పడుకుంటున్నాడు... ఎంతసేపు వ్యాయామం చేస్తున్నాడు..? ఇత్యాది వివరాలను అందులో జోడించాల్సి ఉంటుంది. వాటిని ఆధారం చేసుకుని ఈ యాప్ డెడ్ లైన్ చెప్పేస్తుంది. ఈ యూప్ రూపకర్త జస్ట్ ఎల్ఎల్ సీ సంస్థ దీనిపై మాట్లాడుతూ... ఇది ఇచ్చే సూచనలను బట్టి ఆయుర్దాయం పెంచుకోవచ్చన్నారు.

0 comments:

Post a Comment