నందమూరి అభిమానులకు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది.?? అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్ వాళ్లకు రెండు కళ్లు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఎడమెహం, పెడమొహంగా ఉంటున్నారు. ఎట్టకేలకు వీరిద్దరు కలవబోతున్నారు. అదెలాగంటారా..??
హుద్ హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి టాలీవుడ్ నడుంబిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం టాలీవుడ్ అంతా కదలనుంది. ఈ మ్యాచ్ విజయవంతం కోసం.. టాప్ హీరోలు సైతం తమవంతు కృషిచేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్.. పవణ్ కళ్యాణ్-మహేష్ బాబులు కలసి ఓ స్కిట్ చేయబోతున్నారు. దీనిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు సమాచారం. తాజాగా, తారల మ్యాచ్ లో మరో విశేషం కూడా వచ్చి చేరింది. అదే బాబాయ్-అబ్బాయ్ కలసి ఓ స్కిట్ చేయబోతున్నారంట. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ లను ఓ సూపర్ స్కిట్ లో కనిపించనున్నట్లు సమాచారమ్. దీనిని.. బోయపాటి శ్రీను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. నందమూరి అభిమానులకు పండగే పండగ … !!

0 comments:
Post a Comment