CSS Drop Down Menu

Wednesday, November 19, 2014

నాతో "పడుకోవాలన్న" దర్శకుడు ? సుర్విన్ చావ్లా !

నా జీవితంలో ఒకానొక ఫేజ్ లో ప్రతీ రోజు చాలా ఇండీసెంట్ ప్రపోజల్స్ ని ఎదుర్కొన్నాను. అదృష్టవశాత్తు అవేమీ ముంబైలో ఎదురుకాలేదు. అయితే సౌత్ లో మాత్రం టాప్ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరక్టర్ కు ఏజెంటని చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం అలాంటి ప్రపోజల్ పెట్టాడు. మా సార్ నీతో సినిమా జరుగుతున్నంత సేపూ రిలేషన్ పెట్టుకుంటారు,నువ్వు నీ క్యారెక్టర్ ని బాగా అర్దం చేసుకోవటానికి అది కుదురుతుంది.ఇష్టమైతే చెప్పు అంటూ ఆఫర్ ఇచ్చాడు. కానీ తిరస్కరించాను అంటోంది సుర్విన్ చావ్లా.

 హేట్ స్టోరీ 2 తో పాపులర్ అయిన ఆమె తెలుగులో రాజు-మహారాజు చిత్రం చేసింది. ఆమె మాట్లాడుతూ... ఎప్పుడైతే అలాంటి రిలేషన్ అంటూ మీడియేటర్ అలాంటి ప్రపోజల్ పెట్టాడో అప్పుడే అర్దమైంది.ఆ డైరక్టర్ నాతో పడుకోవాలని అడుగుతున్నాడని, వెంటనే నేను ఎవరితో ఉండాలో అక్కర్లేదో ఎవరూ డిసైడ్ చేయక్కర్లేదు.నువ్వు నోరు మూసుకో అన్నాను.అంటూ చెప్పుకొచ్చింది. సౌత్ డైరక్టర్ అంటూ ఆమె చేసిన ఈ ఆరోపణలు ఏ దర్శకుడు గురించి అనేది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రిలో రకరకాల గుసగుసలకు దారి తీసింది.







0 comments:

Post a Comment