బీజేపీ నేత, కర్ణాటక ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆ రాష్ట్రంలో దుమారం రేగింది.
ఈశ్వరప్ప మాటలు చౌకబారుగా ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ పార్టీ నేత ఇలా మాట్లాడి ఉండకూడదు అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. దీంతో, తన తప్పును గ్రహించిన ఈశ్వరప్ప... తనకు మహిళలంటే ఎంతో గౌరవమని... సీఎం, హోంమంత్రి కూతుళ్లు తనకు చెల్లెళ్లతో సమానమని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మాట మార్చారు.
0 comments:
Post a Comment