CSS Drop Down Menu

Monday, November 3, 2014

మనిషా ? పశువా ??


సభ్యసమాజం తలదించుకునే ఘటన విజయవాడలో జరిగింది. కన్నతండ్రే తన కుమార్తెపై అత్యాచారం జరిపాడు. కృష్ణా జిల్లా విజయవాడలోని వాంబే కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన 42 ఏళ్ల ఆటోడ్రైవర్ అప్పారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని 17ఏళ్ల కుమార్తె పదో తరగతి వరకు చదివి ఆపేసింది. స్థానికంగా ఉండే యువకుడితో ఆమె పరిచయం ఏర్పరచుకోగా.. విషయం తెలిసిన అప్పారావు ఆమెపై కన్నేశాడు. బుద్ధిచెప్పాల్సిన తండ్రే కీచకుడయ్యాడు.

బలం కోసమని ఐరన్ ట్యాబ్లెట్స్ అంటూ స్లీపింగ్ పిల్స్ భార్యకు, కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించాడు. వారిద్దరూ మత్తులోకి జారుకున్నాక కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈమధ్యనే అనుమానం వచ్చిన భార్య అప్పారావును నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది... దీంతో తల్లీకూతుళ్లు నున్న గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విచారణలో ఏడాదిగా ఈ దారుణం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. అప్పారావు కుమార్తెను వైద్యపరీక్షలు నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిపై 376 సెక్షన్ కింద కేసుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కీచకతండ్రిని అరెస్టు చేశారు.

0 comments:

Post a Comment