ఆమధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ప్లేయర్ శ్రీశాంత్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ ఫిక్సర్ టాలీవుడ్ వెండితెరపైకి రాబోతున్నట్లు సమాచారం. ఆ మధ్య ఇతగాడు హైదరాబాద్ రావడం , పూరి జగన్నాథ్ ముచ్చటగా కట్టించుకున్న కేవ్ లో అతన్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ కి ఓ కారణం ఉన్నదనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే….ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీశాంత్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో శ్రీశాంత్ విలన్ గా ఎంచుకున్నాడట పూరి. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీశాంత్ ఇక క్రికెట్ ఎలాగు ఆడే అవకాశం లేదు కాబట్టి శ్రీశాంత్ నటుడిగా స్థిరపడిపోయే అవకాశం ఉన్నదని అనుకోవచ్చు.
0 comments:
Post a Comment