అక్కినేని ఇంటి కొత్త హీరో అఖిల్
ఎంట్రీకి సరంజామా సిద్ధమవుతోంది. ఈసినిమాని పక్కా కమర్షియల్
చిత్రంగా నిలబెట్టాలని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అఖిల్ ఎంట్రీ
బాధ్యత వి.వి.వినాయక్‌పై పెట్టారు. ఆయన ఈ కథకి అదనపు హంగులు
అద్దుతున్నారు. వినాయక్ సినిమా అంటే భారీ యాక్షన్ హంగామాతో పాటు,
రసవత్తరమైన గీతాలూ ఉంటాయి. ఈసినిమాలోనూ అలాంటివి ప్లాన్ చేస్తున్నారు.
అఖిల్ కోసం ఐటెమ్ గీతం ఉండాల్సిందే అని... చిత్రబృందం తీర్మాణించిందట. ఆ
పాటలో ఓ అగ్ర కథానాయికతో డాన్స్ చేయించాలని వినాయక్ భావిస్తున్నారు.
తెలుగునాట టాప్ కథానాయికగా వెలుగొందుతున్న తార చేత అఖిల్‌తో స్టెప్పులు
వేయించాలని టీమ్ భావిస్తోంది. అవసరమైతే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లను
దింపి - ఆ పాటకి మరింత హైప్ తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నార్ట. అనూప్
రూబెన్స్, దేవిశ్రీ ప్రసాద్.. ఇద్దరిలో ఒకర్ని సంగీత దర్శకుడిగా
సెలెక్ట్ చేయాలని భావిస్తున్నారు. దేవి అయితే తనకు కంఫర్ట్‌గా
ఉంటుందని వినాయక్ చెబుతున్నాడట. దేవికి ఐటెమ్ గీతాల స్పెషలిస్టు అనే
ముద్ర ఉంది. దాంతో ఈ పాట మరింత సూపర్బ్‌గా వచ్చే ఛాన్సుందని
చిత్రబృందం నమ్మకం పెంచుకొంటోంది. మరి ఈ ఐటెమ్ గీతంలో కనిపించే
కథానాయికలెవరో మరి.
0 comments:
Post a Comment