కార్లంటే గేర్లు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పెరిగిపోతున్న ట్రాఫిక్ లో నగర రోడ్లపై గేర్ ఉన్న కార్లను నడపాలంటే కష్టమే. అందుకే
కంపెనీలు ఆటోమేటిక్ కార్లపై దృష్టిపెట్టాయి. తక్కువ బడ్జెట్ లో కస్టమర్లకు
అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లు ఏంటో ఓ సారి చూద్దాం.
1. మారుతీ సుజుకీ కొత్త అల్టో కె 10 : అల్టో కె 10లో మార్పులు చేర్పులు
చేసింది మారుతీ. ఈ కొత్త కె 10 కారు వచ్చే నెల్లో మార్కెట్లోకి రానుంది.
సెలీరియో తరహాలో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండటం ప్రత్యేకత.
అంతేకాదు పాత అల్టో తో పోలిస్తే ఈ కొత్త కె-టెన్ 75 కిలోల బరువు
తగ్గించుకొని లైట్ వెయిట్ తో డిజైన్ చేయబడింది. అంతేకాదు మంచి ఇంధన
సామర్థ్యం కూడా ఇవ్వగలదని ప్రకటించింది. ఈ గేర్ లేని కారు లీటర్ కు 24
కి.మీ మైలేజీ ఇవ్వగలదు. ధర కూడా రూ.3-3.5 లక్షల లోపు ఉండవచ్చని
భావిస్తున్నారు.
2. మారుతీ సుజుకీ సెలీరియో : AMT ఫీచర్ తో వచ్చిన తొలికారు సెలీరియో.
దేశంలోనే మొదటిసారిగా మారుతీసుజుకీ ఈ కారును ప్రవేశపెట్టింది. ట్రాఫిక్
ఎక్కువగా ఉండే నగరాల్లో ఈకారు మంచి రైడ్ ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇక
మైలేజీ లీటర్ కు 23.1 కి.మీ ఇస్తోంది. ధర రూ. 4.49 లక్షలుగా ఉంది.
3. మారుతీ సుజుకీ రిట్జ్ : రిట్ట్ జలో ఆటోమేటిక్ వర్షన్ VXi వేరియంట్ లో
అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ , పవర్ విండోస్, పవర్
స్టీరింగ్, ఏసీ, ఏబీఎస్, ఈబీడీ, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తదితర
ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 5.76 ( ఎక్స్ షోరూం , ఢిల్లీ )
4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 : దేశంలో మారుతీ సుజుకీ తర్వాత ఎక్కువ కార్ల
సేల్స్ జరిపేది హ్యుందాయ్. ఇప్పుడు ఈ కంపెనీ కూడా గ్రాండ్ ఐ 10లో 4గేర్
ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను తీసుకువచ్చింది. మారుతీ తరహాలోనే హ్యుందాయ్
కూడా తన లేటెస్ట్ మోడల్స్ లో ఏఎంటీ ఫీచర్ ను తీసుకువస్తోంది. గ్రాండ్ ఐ10
ఆటోమేటిక్ కారు ధర రూ.5.92 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )
5. హోండా బ్రియో : లుక్ లోనూ, డ్రైవింగ్ పరంగానూ బ్రియో ముచ్చటైన కారని
ఆటోమొబైల్నిపుణులు చెబుతుంటారు. సిటీ తరహాలోనే బ్రియోలోనూ iVTEC ఇంజిన్
ఉంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల బ్రియో లీటర్ కు 16.5 కి.మీ
మైలేజీ నిస్తుంది. బ్రియో ఆటోమేటిక్ కారు ధర రూ. 6.05 లక్షలు ( ఎక్స్
షోరూం, ఢిల్లీ )
6. నిస్సాన్ మైక్రా : నిస్సాన్ కూడా ఏఎంటీ కార్లను మార్కెట్లోకి
తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. మైక్రా సీవీటీ పవర్ లో 1.2 లీటర్,
75బీహెచ్ పీ, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, కీ లెస్ ఎంట్రీ స్టాట్, బ్లూటూత్
టెలిఫోన్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.దీని ధర
రూ.6.39 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )
7. టాటా జెస్ట్ : టాటా జెస్ట్ డీజిల్ కారులో ఆటోమేటిక్ గేర్ బాక్స్
ఉంది. మారుతీ సుజుకీ సిలీరియో తరహాలో అవరసమైతే ఆటోమేటిక్ నుంచి మ్యానువల్
ట్రాన్స్ మిషన్ గానూ మార్చుకోవచ్చు. లీటర్ కు 23 కిమీ మైలేజీ ఇవ్వగల జెస్ట్
ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారు ధర రూ. 7.3 లక్షలు( ఎక్స్ షోరూం, ఢిల్లీ )
0 comments:
Post a Comment