CSS Drop Down Menu

Thursday, November 20, 2014

బస్సు లేదా కారు ప్రయాణంలో "వాంతులవకుండా" ఉండాలంటే ?

బస్సు లేదా కారులో ప్రయాణాలు చేస్తుంటేనో లేదంటే తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుందామని వెళుతున్నప్పుడో చాలామంది వాంతులు చేసుకుంటూ కనబడుతుంటారు. కొందరిలో ఈ వాంతులు మరీ విపరీతంగా అవుతుంటాయి. దీంతో నీరసం పెరిగి ప్రయాణాలు చేయాలంటేనే అయిష్టత కలుగుతుంది. ఇలాంటి వారు ప్రయాణానికి ముందుగా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిది. దీంతోపాటు నిమ్మకాయను వెంట తీసుకువెళితే మరీ మంచిది. ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయ వాసన చూస్తూ ఉండండి. 
 
ప్రయాణానికి ముందుగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవద్దు. అలాగే కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఇలాంటివి తీసుకోవడం వ్లల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. అలాగే ఛీజ్ మరియు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పాలు మరియు పాల పదార్థాలను కూడా ప్రయాణానికి... అంటే వాంతులు చేసుకునే సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉండటం మంచిది. 
 
అలాగే వాంతులవుతాయన్న ఆలోచనను పక్కనబెట్టి ఏదైనా పుస్తకాన్ని చదివేందుకు ప్రయత్నించండి. లేదా మీ తోటి ప్రయాణీకులతో మాట్లాడండి. దీంతో వాంతులవుతాయన్న ఆలోచన తొలగిపోయి మీ ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది. ప్రయాణాల్లో వాంతులతో సతమతమయ్యేవారు ప్రతి రోజు పరకడుపున ఓ చెంచా తేనెను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

0 comments:

Post a Comment