వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా
ఉండండి. నోరెండిపోవడానికి చెక్ పెట్టే కీరదోస ఆకలిని పెంచుతుంది. శరీరంలో
నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
కీరదోసలో విటమిన్లు లేకపోయినా.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్,
ఫాస్పరస్, సిలికాన్, క్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి.
కీరదోసలోని పొటాషియం రక్తంలోని ఎరుపు
కణాలను పెంపొందింపజేస్తాయి. ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని
నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ వ్యాధులను
నిరోధిస్తుంది. శరీరంలో విష పదార్థాలు చేరనీయకుండా చేయడంలో కీరదోస మెరుగ్గా
పనిచేస్తుంది. దోస మెదడును బలపరుస్తుంది. తల ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది.
మెదడును ఉత్సాహపరుస్తుంది. కఫం, వాతాన్ని నిరోధిస్తుంది.
0 comments:
Post a Comment