CSS Drop Down Menu

Thursday, March 19, 2015

"పళ్ల" రసాలు "అతి"గా తాగితే ?

ఆరోగ్యానికి మేలు చేస్తాయని పళ్ల రసాలు తెగ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త పండండి. రోజూ తియ్యటి పళ్ల రసాలు తాగే వాళ్లలో రక్త పీడనం బాగా పెరుగుతుంది. దాంతో హార్ట్ ఎటాక్ రిస్క్ లేదా యాంజినా (ఛాతిలో నొప్పి) ఏర్పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పళ్ల రసాల్లో అవసరమైన విటమిన్లు ఉన్నమాట వాస్తవమే కానీ వాటి పాటు అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు. 
 
ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో కమలా పళ్ల రసం, స్వీటెన్డ్ డ్రింక్‌లంత హానికరం అని తేలింది. 250 మిల్లీలీటర్ల కమలా పళ్ల రసంలో 115 కాలరీలు లేదా ఏడు టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం రోజుకి ఆరు స్పూన్ల చక్కెర మాత్రమే వాడాలి. అందుచేత ఆరెంజ్ జ్యూస్‌ను పంచదార కలపకుండా  తాగాలి. లేకుంటే ఆరెంజ్ జ్యూస్‌లో కాస్త నీటి మోతాదు పెంచాలి. రోజూ కాకుండా వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు. 


0 comments:

Post a Comment