బెంగుళూరు లో ఎన్నో నగరాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తారు. కనుక
బెంగుళూరు రెస్టారెంట్ లు వారి వారి అభిరుచులకు తగిన ఆహారాలు అందించాలి.
ఇరవై నాలుగు గంటలూ కష్టపడే ఇక్కడి ప్రజలకు ఈ బెంగుళూరు లో రుచికర ఆహారాలు
తినటం ఒక ఆనందకర అంశంగా వుంటుంది. కుటుంబ సభ్యులతో, లేదా స్నేహితులతో కలసి
సాయంకాల సమయం నుండి రాత్రి బాగా పోద్దు పోయే వరకూ వివిధ రెస్టారెంట్ లలో
కూర్చుని రిలాక్స్డ్ గా వారికి నచ్చిన వివిధ రుచికర ఆహారాలు తిని
ఆనందిస్తారు. బెంగుళూరు ఆహార ప్రియులకు ఒక మంచి ప్రదేశంగా మారింది. ఈ
రెస్టారెంట్ లకు వచ్చే వారు సాధారణంగా, పరిశుభ్ర వాతావరణం, నాణ్యత కల
ఆహారం, మంచి సేవలు ఆశిస్తారు. బెంగుళూరు లోని విభిన్న సంస్కృతులు ఆహారాల
విషయంలో ఒక ప్రత్యేకత ను సంతరించుకొన్నాయి. వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక
రెస్టారెంట్ లు బెంగుళూరు లో వెలిశాయి. ఈ రెస్టారెంట్లలో ఉత్తమమైన సేవలు,
ఆహారం, పరిశుభ్రతా నిర్వహణ కల వాటిని కొన్నిటిని పరిశీలిద్దాం.
జల్సా జల్సా రెస్టారెంట్ :-
ఈ ప్రత్యేక రెస్టారెంట్ మారథ హళ్లి లో కలదు. ఈ రెస్ట రెంట్
వాతావరణం మొగలుల కాలం నాటి ఆహారాలు, ఆ నాటి సంగీతం, డ్రామా, వాతావరణం మీకు
గుర్తు చేస్తుంది. మొగలుల కాలంనాటి రుచికర వంటకాలను మీకు అందిస్తుంది.
రెస్ట రెంట్ లోకి ప్రవేశిస్తే చాలు, అంతా మొగలుల కాలంనాటి వాతావరణమే. సిబ్బంది
నవాబుల కాలం నాటి డ్రెస్ లు ధరించి ఉర్దూ కవితలతో అలరిస్తారు. అద్దాలు కల
తలుపులు , అతి పెద్ద చాంది లీయర్లు, వైభవోపేత ఫిట్టింగ్ లతో రెస్టారెంట్
మొగలుల విలాస జీవితం గుర్తుకు తెస్తుంది.
బ్లాక్ పెరల్ రెస్టారెంట్ :-
బెంగుళూరు లో మరొక ప్రత్యేక హోటల్ బ్లాకు పెర్ల్. ఈ రెస్టారెంట్ ఎంతో
సృజనాత్మకతలతో నిర్మించారు. ఒక ఓడ, ఓడ దొంగలు వారి జీవన శైలి అనే అంశాన్ని
దృష్టిలో పెట్టుకొని దాని చుట్టూ కదా అల్లి ఈ రెస్టారెంట్ ను రూపొందించారు.
ఈ రెస్టారెంట్ బెంగుళూరు లోని కోరమంగళ లో కలదు. దీనిని రెండు అంతస్తులలో
ఓడకు గల పై అంతస్తు, కింది అంతస్తు గా నిర్మించారు. కింది అంతస్తు వాతావరణం
అంతా పూర్తిగా ఓడ వలే ఒక ఇంజిన్, మరియు తెడ్డు వంటివి కలిగి వుంటుంది. పై
అంతస్తు ఒక దొంగల షిప్ ను పూర్తిగా పోలి వుంటుంది. ఈ రెస్టారెంట్ సిబ్బంది
కూడా ఓడ దొంగలు లేదా పైరేట్ దుస్తులు ధరించి మీకు ఆహారాలు అందించటం ఒక
ఆసక్తికర అంశం.
ఫిరంగి పన్నిరెస్టారెంట్ :-
ఈ విభిన్న రెస్టారెంట్ బెంగుళూరు లోని హోసూర్ రోడ్ లో కలదు. ఈ రెస్టారెంట్
పూర్తిగా ఒక ఇంగ్లీష్ పబ్ ని గుర్తుకు తెస్తుంది. వివిధ సంస్కృతుల ప్రజలు
వచ్చే ఈ రెస్టారెంట్ లో మీకు పూర్తిగా ఇంగ్లాండ్ లోని హోటల్ శైలి ఆహారాలు
వారి అనుకరనలతో అందిస్తారు. మీరు మెచ్చే రుచికర ఆహారాలు, మంచి కిక్ ఇచ్చే
వైన్, లికర్ లు కూడా లభిస్తాయి.
ఇక్కడి టేబుల్స్ లికర్ బారెల్ వలే వుంటాయి. ఇక్కడి ఫర్నిచర్ చాలా వరకూ
ఇంగ్లాండ్ ఫర్నిచర్ ను పోలి వుంటుంది. హోటల్ మధ్య భాగంలో ఒక షిప్ ఉంచారు.
ఇది మరింత బ్రిటిష్ శైలి వాతావరణం చూపుతుంది. రిట్రో మ్యూజిక్, కరాకో
రాత్రులు ఆహార ప్రియులను అలరిస్తాయి.
గుఫ్హా గుఫ్హా రెస్టారెంట్ :-
గుఫ్హా గుఫ్హా రెస్టారెంట్ ఒక గుహ వలే వుంటుంది. ఇది బెంగుళూరు నగరంలోని
జయనగర్ లో కలదు. ప్రత్యేకమైన ఈ రెస్టారెంట్ సీలింగ్ , గోడలు కొండ రాతి వలే
వుంటాయి. చెట్ల బెరడ లు వేలాడుతూ వుంటాయి. లైటింగ్ తక్కువగా వుండి మీరు ఒక
గుహలో కూర్చుని తింటున్నట్లు వుంటుంది. మూలలలో నిప్పు మంటలు వెలుగుతూ
వుంటాయి. ఈ రకమైన మిస్టరీ పరిసరాలు పిల్లలలో భయం కోల్పుతాయి. ఈ హోటల్
సిబ్బంది, ఫారెస్ట్ ఆఫీసర్ ల వలే డ్రెస్ చేసుకొంటారు. మోకాలు వరకు బూట్లు,
పెద్ద టోపీలు పెట్టుకొని వుంటారు.
రోహ్ రోహ్ రెస్టారెంట్ :-
రోహ్ రోహ్ రెస్టారెంట్ బెంగుళూరు లోని బెలందూర్ ప్రదేశంలో కలదు. ఇక్కడ నోరు
ఊరే ఫుడ్ మాత్రమే కాక పరిసరాలు కూడా ప్రత్యేకంగా వుంటాయి. ఎంట్రన్స్ లో
తెల్లటి ఇసుక, స్టోన్ చ్లిప్స్ వుంటాయి. వివిధ దేశాల రెస్టారెంట్ల వాతావరణం
కలిగి వుంటుంది. స్పెయిన్, అరేబియా మొదలగు సంస్కృతులు కలవు. కర్టెన్ లు
కొవ్వొత్తుల వెలుగులు, అద్దాలు మరింత అందాన్ని ఇచ్చాయి. సన్నని వెలుగు
పడుతూ వుంటుంది. చిన్నపాటి సంగీతం కూడా వినపడుతుంది.
సిల్వర్ మెట్రో రెస్టారెంట్ :-
సిల్వర్ మెట్రో రెస్టారెంట్ మడివాల లో కలదు. ఇది మెట్రో ట్రైన్ ఆకారంలో
వుంటుంది. మెట్రో స్టేషన్ ఆకారంలో ఆ అనుభూతులు కలిగిస్తూ, ఇక్కడ మీకు వివిధ
రకాల వంటకాలు లంచ్ మరియు డిన్నర్ లకు బఫే టైపు లో అందిస్తారు. లోపల
ఇందిరానగర్, బ్రిగేడ్ రోడ్ వంటి పేర్లు పెట్టిన ప్రదేశాలు రైలు స్టేషన్
అనుభూతి కలిగిస్తాయి. భోజనం చేస్తూ మీరు ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లు
వుంటుంది. పరిసరాలు, ఆహార నాణ్యత ఉన్నతంగా వుంటాయి.
అంగీతి అంగీతి రెస్టారెంట్ :-
అంగీతి అంగీతి రెస్టారెంట్ గ్రామీణ ప్రాంత పరిసరాలు కలిగి వుంటుంది. ఇది
మ్యూజియం రోడ్ లో కలదు. ఒక డాబా హోటల్ వలే వుంటుంది. బ్రాస్ బొమ్మల లతో
అలంకరణ చేసారు. ఒక డాబా వలే అలంకరించారు. ఈ రెస్టారెంట్ లో ప్రతి ఒక్కరికి
వ్యక్తిగత ప్రైవసీ వుంది.
Very good information
ReplyDelete