వెండితెరపై వెలిగే స్టార్స్ సినిమాల్లో
నటించడం కంటే కూడా బుల్లి తెర షోలు, ప్రకటనల ద్వారానే ఎక్కువ డబ్బులు
సంపాదించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ వరుసలో బాలీవుడ్ హీరో
అమీర్ ఖాన్ ఒక ప్రకటనలో నటించేందుకు పది కోట్లు డిమాండ్ చేశాడట.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ హీరో అమీర్
ఖాన్ సినిమాలను ఎలా ఎంచుకుంటున్నాడో అలాగే యాడ్స్‌ని కూడా సెలక్టీవ్‌గా
ఎంపిక చేసుకుంటున్నాడు. ఆఫర్ వచ్చింది కదా అని ఏది పడితే అది చేయడు.
అప్పట్లో టైటాన్ వాచ్‌లకు, ఇన్ క్రెడిబుల్ ఇండియా యాడ్ లోనూ కనిపించాడు. ఆ
తర్వాత అమీర్ ఖాన్ మరో యాడ్‌ని ఒప్పుకోలేదు.
అయితే తాజాగా అమీర్ ఖాన్ ఓ ఈ కామర్స్ సంస్థ
యాడ్ చేశాడట. నిమిషం పాటు కనిపించే ఆ యాడ్ కోసం అమీర్ ఖాన్ దాదాపు 10
కోట్లు డిమాండ్ చేశారట. అయినా ఆ రేటు ఇచ్చేందుకు సదరు ఆన్‌లైన్ సంస్థ కూడా
ఓకే చెప్పిందట. దాంతో చకచకా యాడ్‌ను ముగించేసి పది కోట్ల రూపాయలు
తీసుకున్నారట.
ఒకే ఒక్క నిమిషానికి 10 కోట్ల రూపాయలు
తీసుకున్న విషయం తెలిసి, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ
యాడ్ త్వరలో బుల్లితెరపై కనిపించనున్నదని బాలీవుడ్ సమాచారం.
0 comments:
Post a Comment