CSS Drop Down Menu

Saturday, March 14, 2015

భారతీయ విద్యార్థుల్ని చేర్చుకోం?ఎందుకంటే,మీది " రేపిస్టు"ల దేశం !

 
భారత్ లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారుతోంది. విద్యార్థినులు ఉన్నచోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని ఓ మహిళా ప్రొఫెసర్ తేల్చిచెప్పింది. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేదిగా ఉంది. 
 
‘మీది రేపిస్టుల దేశం.. అక్కడ నిత్యం అత్యాచారాల సమస్య ఉంది. మీ ఇటర్నెషిప్‌కు అనుమతించేది లేదు. అది సాధ్యం కాదు. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి మీ ఇంటర్నెషిప్‌కు అనుమతించలేం..’ ఇదీ అంతర్జాతీయ విద్యాసంస్థలలో మన దేశానికి ఉన్న పేరు ప్రతిష్టలు.. ఇలా మాట్లాడింది ఓ జర్మనీ ప్రొఫెసర్. ముఖం మీద కొట్టినట్లు సమాధానం చెప్పి.. భారతీయ విద్యార్థి ఇంటర్నెషిప్‌ను తిరస్కరించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
భారతీయ విద్యార్థి ఒకరు తన ఇంటర్నెషిప్ కోసం జర్మనీకి చెందిన లీప్జిగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ బెక్ సికింజర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తన దరఖాస్తును మెయిల్ ద్వారా పంపారు. ఆమె దీనిపై వెంటనే స్పందించారు. ముఖం మీద కొట్టినట్లు తాను విన్నపాన్ని అంగీరించడం లేదని చెప్పేశారు. భారతదేశంలో అత్యాచార సమస్యలు చాలా ఉన్నాయని వింటున్నాం. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఇంటర్నెషిప్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అత్యాచారాల సమస్య ఉన్న దేశం నుంచి వచ్చే వారికి మద్దతు ఇవ్వలేమని తెగేసి చెప్పేశారు. 
 
దీనిపై ఇండియాలోని జర్మనీ రాయబారా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తర్వాత ఆ ప్రొఫెసర్ భారతదేశానికి క్షమాపణలు చెప్పినట్లు వివరించారు. భారతదేశంలో అత్యాచార సంఘటనలపై చాలా సీరియస్‌గా స్పందిస్తుందని జర్మనీ ఎంబసీ తెలిపింది. 


0 comments:

Post a Comment