ప్రేమ.. చాలా లోతైంది.. అంటూ ఎన్మో
కొటేషన్స్ వినివుంటాం.. అలాంటి మధురమైన ప్రేమను కూడా కొలవవచ్చని చైనా
పరిశోధకులు అంటున్నారు. యువతీయువకుల మధ్య ఆకర్షణకు, ఆప్యాయతకు ప్రేమ అనే
అర్థం ఎప్పటి నుంచో ఉంది. ఈ అపురూపమైన భావనను కొలవవచ్చంటున్నారు చైనా
పరిశోధకులు.
ఈ క్రమంలో నిజమైన ప్రేమ ఎంతో
తెలుసుకోవచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జియావో
చు ఝంగ్ అంటున్నారు. ప్రేమలో పడిన, పడని వ్యక్తుల మెదళ్లలో రసాయనిక
మార్పులు భిన్నంగా ఉంటాయని తెలిపారు. సుమారు 100 మంది మెదళ్లను స్కాన్ చేసి
ఈ వివరాలు రాబట్టామని వివరించారు. వారిలో ప్రేమ శాతం ఎంతుందన్న విషయాన్ని
రసాయనిక మార్పులను బట్టి ఇట్టే చెప్పేయవచ్చని ఝుంగ్ చెబుతున్నారు.
ప్రేమలో పడిన వారి యాక్టివిటీస్‌ను ఎమ్మారై
స్కాన్ ద్వారా కనుగొనడం జరిగిందని.. ప్రేమించే వారు.. ప్రేమలో పడిన వారి
మెదడు పనితీరు, భావోద్వేగం ఎక్కువే ఉన్నట్లు తేలిందని ఝంగ్ చెప్పారు. అదే
ప్రేమ లేని వారిలో మెదడు మెరుగ్గా పనిచేయట్లేదని, మిగిలిన యాక్టివిటీస్
శాతం కూడా తక్కువగా నమోదైనట్లు పరిశోధకులు తెలిపారు.
0 comments:
Post a Comment