దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో
ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను
తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం
ఉంటుంది.
అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా
పనిచేస్తుంది. అల్లాన్ని పది పన్నెండు చిన్న ముక్కలుగా కోసి.. మూడు కప్పుల
నీటిలో 20 నిమిషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక చెంచా తేనె కలపండి.
నిమ్మకాయ రెండు చెక్కలు పిండేయండి. రుచి చూసి ఘాటుగా అనిపిస్తే కాసిని
నీళ్లు కలపండి. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.
చెంచా నల్ల మిరియాలకు చెంచా తేనె కలపండి.
వీటిలో వేడినీళ్లు పోయండి. ఈ మిశ్రమంపై మూతపెట్టి పావుగంట తరువాత తాగితే
ఫలితం ఉంటుంది. అలాగే కప్పు నీటిలో చెంచా పసుపూ, చెంచా వామూ వేసి వేడి
చేయండి. నీళ్లు సగానికి సగం తగ్గేదాకా మరగనిచ్చి దించేయండి. దీనికి తేనె
కలిపి రోజులో మూడుపూటలా తాగితే మంచిది.
Can i Post this on my Twitter account
ReplyDeleteOk You can post.
ReplyDelete