హాలీవుడ్ నటి, అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి, ఆమెకు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె
ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు
సంపాదించడానికి వచ్చే ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు.
ఆమె మకావ్‌లో ఓ ప్రైవేట్ పార్టీలో 40 నిమిషాల పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్
ఇచ్చారు. ఇందుకు గాను ఆమె రూ. 1.75 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లపైనే)
చార్జ్ చేసారు. 45 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ తన సెక్సీ అందాలు,
అదరగొట్టే పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.
ఆమెకు 40 నిమిషాల పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు 1.75 మిలియన్ డాలర్ల
రెమ్యూనరేషన్ తో పాటు అమెరికా నుండి మకావ్ వరకు ప్రత్యేక విమానం ఏర్పాట్లు
గట్రా చేసారట. దీన్ని బట్టి ఆమె షోలకు ఉన్న ఫాలోయింగ్, డిమాండ్ ఏమిటో
అర్థం చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment