CSS Drop Down Menu

Thursday, March 5, 2015

రామ్ గోపాల్ వర్మ అరెస్టు ?


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కలకలం రేపారు. ఇటీవల ఎప్పుడూ ట్విట్టర్‌లో ఉండే వర్మ తాజాగా తనను పోలీసులు అరెస్టు చేశారంటూ ఫోటోతో పాటు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే 

ఫన్ కోసం ఓ పోలీసు కారెక్కి..  తాను అరెస్టయ్యానంటూ తన ట్విటర్ లో ఆ ఫోటో పెట్టిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సరదా ఆయనను చిక్కుల్లో పడేసేట్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌‌లో ఓ ఉదయం పూట జరిగిన ఈ వైనం మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీన్ని సీరియస్ గా పరిగణించిన ఉన్నతాధికారులు డ్యూటీ డ్రైవర్ శ్రీధర్ రెడ్డి నుంచి రాతపూర్వక వివరణ కోరారని తెలుస్తోంది.

ఎవరి అనుమతితో వర్మ ఇలా చేశారని వారు ఆరా తీస్తున్నారట..శ్రీధర రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా వాళ్ళు వర్మ మీద కేసు నమోదు చేయవచ్చునని  అంటున్నారు.

0 comments:

Post a Comment