CSS Drop Down Menu

Wednesday, April 1, 2015

"రజినీ" తప్పు చేస్తున్నాడంటున్న "కమల్"


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తప్పు చేస్తున్నాడంటూ మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలో మంచి మిత్రులుగా ఆ ఇద్దరికీ పేరుంది. అటువంటప్పుడు రజినీని తప్పుపట్టాల్సిన అవసరం కమల్‌కి ఏమొచ్చిందనే సందేహం రావచ్చేమో. అయితే అందుకు కారణం వేరే వుంది. 
రజినీ చివరి సినిమా లింగా డిస్ర్టిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగల్చడం.. రజినీనే నమ్ముకుని భారీ ధరకు 'లింగా' హక్కుల్ని కొన్న తాము ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని డిస్ర్టిబ్యూటర్లు నిరసన తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో డిస్ర్టిబ్యూటర్ల పోరు భరించలేక తాజాగా రజినీ వారికి సొంతంగా కొంత నష్టపరిహారాన్ని చెల్లించాడు. రజినీ తీసుకున్న ఈ  నిర్ణయం కమల్‌కి తప్పుగా అనిపించిందట. నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం రజినీకి లేదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇక హీరోలు సినిమాలు చేసి వెనకేసుకునేదేమీ వుండదని తన మనసులో మాటని బయటపెట్టాడట కమల్.

0 comments:

Post a Comment