CSS Drop Down Menu

Saturday, March 28, 2015

"కొత్త వివాదానికి" తెరలేపిన లాలూ ప్రసాద్ యాదవ్

తాము అధికారంలో ఉన్నట్టయితే పబ్లిక్ పరీక్షలు రాసేందుకు హాజరయ్యే విద్యార్థులకు తామే పుస్తకాలు పంపిణీ చేసి కాపీ కొట్టమని చెప్పేవాళ్లమంటూ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. 
 
ఇటీవల బీహార్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. బీహార్‌లో టెన్త్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జాకీచాన్‌లాగా బిల్డింగు ఎక్కి మరీ కొందరు చిట్టీలు అందించారు. ఇదో ఉత్సవంలా జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనం చోటు చేసుకుంది. 
 
దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. ‘విద్యార్థులకు చిట్టీలు ఇవ్వడానికి బల్లుల్లాగా భవనాలు ఎక్కారు. ఎంత కష్టం. మేమైతే కాపీ కొట్టేందుకు పుస్తకాలే అందించేవాళ్లం’ అంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా బీహార్‌ ప్రభుత్వాన్ని కేంద్రం కోరిన తర్వాత ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. 


0 comments:

Post a Comment