ఇటీవల కొందరు హీరోయిన్లు వచ్చే
అవకాశాలన్నిటిని చక్కగా ఉపయోగించుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో
అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఈ కోవలో అందాల తార చార్మీ కూడా
చేరినట్టుంది. అమ్మడు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరో వైపు ఐటమ్స్
సాంగ్స్ కూడా చేస్తూ దూసుకుపోతుంది.
ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మి' చిత్రంలో
నటిస్తున్న కథానాయిక చార్మీ మరోపక్క తమిళంలో ఓ ఐటమ్ పాటలో నటిస్తున్న సంగతి
మనకు తెలిసిందే. విక్రం హీరోగా నటిస్తున్న '10 ఎణ్రుదుకుళ్ళ' చిత్రంలో ఈ
ముద్దుగుమ్మ చేస్తున్న ఈ ప్రత్యేక గీతాన్ని చాలా రిచ్ గా
చిత్రీకరిస్తున్నారు. పైగా, తొమ్మిది నిమిషాల పాటు సాగే ఈ ఒక్క పాటకు
చార్మీ ఏకంగా 30 లక్షల పారితోషికం తీసుకుంటోందట!
0 comments:
Post a Comment